వరద కాలువకు 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల

వరద కాలువకు 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​హెడ్ రెగ్యులేటర్ ద్వారా వరద కాలువకు శనివారం అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి సాగు కోసం కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలన్న ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు(90.31 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1082.10 అడుగుల(58.36టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్​లో 1085.40 అడుగుల (68.11 టీఎంసీలు) నీరు ఉన్నట్లు పేర్కొన్నారు. కాకతీయ కాలువకు 3,500 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, అలీసాగర్ కు 476 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు270 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.