ఏపీ పాలిసెట్ - 2024 చివరి దశ నోటిఫికేషన్ విడుదల 

 ఏపీలో పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం తుది దశ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. ఏపీ పాలిసెట్ - 2024లో అర్హత పొంది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంది. ఆన్‌లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ ధృవీకరణ, ఎంపికల నమోదు ప్రక్రియల కోసం జూలై 11 నుండి 14 వరకు సమయం కీటాయుంచామన్నారు.

 జూలై 16న సీట్ల కేటాయుంపు ఉంటుందన్నారు. సంపూర్ణ వివరాలు, షెడ్యూల్ కోసం https://appolycet.nic.in వెబ్‌సైట్‌లోని వివరణాత్మక నోటిఫికేషన్ పరిశీలించాలని డాక్టర్ నవ్య స్పష్టం చేశారు. సెల్ఫ్ జాయినింగ్ , రిపోర్టింగ్ కోసం జూలై 18 నుండి  20 వరకు అవకాశం ఉంటుందని, ఇప్పటికే క్లాసులు ప్రారంభం అయ్యాయని వివరించారు