వారబందీ పద్ధతిలో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్పీ ఆయకట్టుకు సాగు నీరు

వారబందీ పద్ధతిలో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్పీ ఆయకట్టుకు సాగు నీరు

తిమ్మాపూర్, వెలుగు: జనవరి 1 నుంచి మార్చి 31 వరకు యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ఎల్ఎండీలో 23.735 టీఎంసీలు,  శ్రీరాజరాజేశ్వర(ఎంఎంఆర్)లో 26.73 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. రెండు ప్రాజెక్టుల నుంచి 25 టీఎంసీలు, ఎస్సారెస్పీ నుంచి 5 టీఎంసీలతో కలిపి 30 టీఎంసీల నీటిని తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించనున్నట్లు చెప్పారు. 

కాకతీయ కెనాల్  ప్రధాన కాలువ ద్వారా నిరంతరంగా నీటిని వదులుతూ, డిస్ట్రిబ్యూటరీలకు మాత్రం ఆన్,​ఆఫ్​ పద్ధతిలో విడుదల చేస్తామన్నారు. ఎల్ఎండీ దిగువన స్టేజ్-1లో 146 కిలోమీటర్  నుంచి 284  కిలోమీటర్​మహబూబాబాద్ వరకు ఒక విడతగా 8 రోజులు, స్టేజ్-2లో 284 కిలోమీటర్  నుంచి 349 కిలోమీటర్ సూర్యాపేట వరకు 7 రోజులు మరో విడతలో నీటిని వదలనున్నట్లు చెప్పారు.

కాలువ మొత్తంలో 71 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా.. స్టేజ్--1 కింద 5 లక్షల ఎకరాలు, స్టేజ్-2 కింద 4 లక్షల ఎకరాలకు నీటిని వదులుతామని తెలిపారు.