మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య సూత్రాల సదస్సు పోస్టర్లను శనివారం కలెక్టర్ జి.రవినాయక్ ఆవిష్కరించారు. సదస్సుకు సైకాలజిస్టు ప్యాకల్టీ డాక్టర్ జంగం విశ్వనాథ్, పీయూ అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ వాసు చైతన్య హాజరవుతారన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సెక్రటరీ భరత్ కుమార్, బంజారా గిరిజన విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు సంతోష్ రాథోడ్, శ్రీను , బాలాజీ , రమేశ్ పాల్గొన్నారు.