ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

విజయవాడ: ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది.  మే 5వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.  మే 5 నుంచి  23వ తేదీ వరకు సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో తరగతులు.. పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు నెలకొన్న నేపధ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు స్పందించింది. పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతుండడంతో ఆన్ లైన్ క్లాసులతోపాటు.. నేరుగా కాలేజీలకు వెళ్లేందుకు అనుమతించారు.  మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్‌ విద్యార్థులు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. దీనికంటే ముందు మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ జరుగుతాయి.  ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

అనాథ శవాన్ని మోసి, అంత్యక్రియలు జరిపిన మహిళా ఎస్సై

‘ద వైట్​ టైగర్’​ మన తెలుగోడే

3.79 కేజీల బంగారం.. 435 క్యారెట్ల వజ్రాల స్మగ్లింగ్