- 24న సెస్ ఎన్నికలు
- 26న ఫలితాలు... షెడ్యూల్ విడుదల
- 12 స్థానాలు జనరల్, రెండు మహిళ, ఒకటి ఎస్సీ
- జనరల్‌కు కేటాయింపు మొత్తం ఓటర్లు 87,130
- వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారి మమత
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎలెక్షన్ఆఫీసర్మమత సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 24న ఎన్నికలు నిర్వహించనుండగా 15 డైరెక్టర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. డిసెంబర్ 13 నుంచి 15 వరకు నామినేషన్ల స్వీకరణ, 16న స్క్రుటిని, 17న నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్ 26న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల ప్రకటన, డిసెంబర్ 27న ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరుగుతుందని ఎలెక్షన్ఆఫీసర్మమత వెల్లడించారు.
15 డైరెక్టర్ స్థానాలకు రిజర్వేషన్లు ఇలా..
సిరిసిల్ల టౌన్ 1 మహిళ జనరల్, వేములవాడ టౌన్1 మహిళ జనరల్, బోయిన్ పల్లి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కాగా సిరిసిల్ల టౌన్ 2, వేములవాడ టౌన్ 2, వేములవాడ రూరల్, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, గంబీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట జనరల్ కు కేటాయించారు. కేవలం మూడు స్థానాలకే రిజర్వేషన్ కేటాయించగా 12 స్థానాలు జనరల్ కేటాయించారు. సిరిసిల్లలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు ఒక్క స్థానాన్ని కూడా రిజర్వ్చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని నేతలు అంటున్నారు. సెస్ లో బకాయిలు ఉన్న వినియోగదారులు ఓట్లు తొలగించగా ప్రస్తుతం 87,130 మంది ఓటర్లు ఓటేసేందుకు అర్హులు అయ్యారు.
మండలాలవారీగా ఓటర్లు..
సిరిసిల్ల టౌన్ 8,161 సిరిసిల్ల టౌన్ 2 7,179 తంగళ్లపల్లి 6,702 ఇల్లంతకుంట7,970 గంభీరావుపేట 6,106 ముస్తాబాద్ 6,607 ఎల్లారెడ్డిపేట7,035 వీర్నపల్లి 1,518 చందుర్తి 6,353 రుద్రంగి 1,743 కోనరావుపేట 6,890 వేములవాడ టౌన్ వన్ 7,729 వేములవాడ టౌన్ టు 2,470, వేములవాడ రూరల్ 3,765 బోయిన్ పల్లి 6,902 మొత్తం ఓట్లు 87,130. కాగా సెస్ డైరెక్టర్స్థానాలకు రిజర్వేషన్ ఖరారు కావడంతో ఉత్కంఠ వీడింది. కాగా బీసీలకు, ఎస్టీలకు ఒక్క రిజర్వేషన్ స్థానాన్ని కూడా ఇవ్వకపోవడంతో ఆశావాహుల్లో నిరాశ నెలకొంది.