
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 3261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్‌లోని ముఖ్యమైన టాపిక్స్ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వారం తెలుసుకుందాం..
టెన్త్ విద్యార్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకునే నిరుద్యోగులకు ఎస్ఎస్సీ సెలెక్షన్స్ జాబ్స్ మంచి అవకాశం. పరీక్షకు నాలుగు నెలల సమయం ఉన్నందున ప్లాన్ ప్రకారం సెలెక్టెడ్ బుక్స్‌తో ప్రిపరేషన్ ప్రారంభిస్తే కొలువు సాధించడం సులువు.
పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్, గర్ల్స్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్ టైల్ డిజైనర్ తదితర పోస్టులున్నాయి.
సెలెక్షన్ ప్రాసెస్: జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అనే నాలుగు విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పేపర్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో పాస్ అయిన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా స్కిల్ టెస్ట్ (టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ) ఉంటుంది.
విద్యార్హతలు: పోస్టు అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ (10+2), గ్రాడ్యుయేషన్, ఆపై ఉత్తీర్ణత.
వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులుంటాయి.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరితేది: 28 అక్టోబర్
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: 2022 జనవరి/ ఫిబ్రవరి
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్సైట్: www.ssc.nic.in
రెఫరెన్స్ బుక్స్:
జనరల్ ఇంటెలిజెన్స్ – ఆర్ఎస్ అగర్వాల్, కిరణ్ పబ్లికేషన్
జనరల్ అవేర్నెస్ – లూసెంట్స్ జీకే
ఇంగ్లిష్ – ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ బై హరి మోహన్ ప్రసాద్ అండ్ ఉమా సిన్హా
అర్థమెటిక్ – క్విక్కర్ మ్యాథ్స్ బై ఎమ్ టైరా
ప్రిపరేషన్ ప్లాన్:
నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది. ఈ నాలుగు నెలల సమయంలో సిలబస్‌లోని అంశాలను సరైన ప్రణాళికతో పూర్తి చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ప్రామాణికంగా తీసుకొని వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. అర్థమెటిక్ సబ్జెక్ట్‌లో టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఎగ్జామ్‌లో 100 ప్రశ్నలను గంట సమయంలో పూర్తి చేయాలి అంటే ప్రతి ప్రశ్నకు 36 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. ప్రీవియస్ పేపర్లు, మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ చేయోచ్చు. జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా సబ్జెక్ట్‌ను కరెంట్ ఎఫైర్స్కు అనుసంధానం చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. డైలీ న్యూస్ పేపర్స్ చదువుతూ కరెంట్ టాపిక్స్ మీద నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే రివిజన్ టైమ్‌లో ఈజీగా ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఎక్కువగా ఆంటోనిమ్స్, సినోనిమ్స్, స్పాటింగ్ ఎర్రర్, గ్రామర్ మీద ఫోకస్ చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో రేషియస్, ఆవరేజెస్, నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టాన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాఫిక్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ వైజ్ కట్ఆఫ్ లేనందున ముందు ఈజీగా అనిపించే సెక్షన్ లో ఎక్కువ ఆన్సర్స్ గుర్తించాలి. ఇన్‌టైమ్‌లో అక్యురసీగా ఆన్సర్ చేసేలా ప్రాక్టీస్ చేస్తే కొలువు సులువుగా సాధించవచ్చు.
- వివేక్ చిగురుపల్లి
అచీవర్స్ ఐఏఎస్ అకాడమీ, హనుమకొండ