
హైదరాబాద్, వెలుగు: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2లో భాగంగా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి సర్కారు రూ.90.78 కోట్ల నిధులను విడుదల చేసింది. డీబీఎం 60లోని ప్యాకేజీ 53లో భాగంగా ఆయా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మేజర్, మైనర్ కాలువల డిజైన్, వివిధ పరీక్షలు, వాటి నిర్మాణం కోసం ఈ నిధులను విడుదల చేస్తూ ఇరిగేషన్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఈఎన్‌సీ జనరల్, వరంగల్ సీఈలు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.