గ్రేటర్లో కొత్త ఫ్లై ఓవర్ల నిర్మాణం ఇక్కడే .. రూ.5,942 కోట్లు రిలీజ్

గ్రేటర్లో  కొత్త ఫ్లై ఓవర్ల నిర్మాణం ఇక్కడే .. రూ.5,942 కోట్లు  రిలీజ్

హైదరాబాద్ ,వెలుగు:  హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ ఫర్ మేటివ్ ఇన్ ఫ్రాస్టక్చర్ (  హెచ్ సిటీ)  ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5,942 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ నిధులతో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్​పాస్ లు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. 

రూ. 758 కోట్లతో  ఖైరతాబాద్ జోన్ లోని మెహిదీపట్నంలో ఒకటి,  జూబ్లీహిల్స్ లో రెండు  చోట్ల  ఫ్లై ఓవర్ లు, అండ్ పాస్ లు , రోడ్డు విస్తరణ చేయనున్నారు. రూ. 837 కోట్లతో  శేరిలింగంపల్లి  జోన్  లోని ఖాజాగూడ, త్రిపుల్ ఐటీ, విప్రో సర్కిల్ లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు,  శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర, మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర నిర్మించనున్నారు. కూకుట్ పల్లి జోన్ లో ఫ్లై ఓవర్ లు, సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లో రోడ్ల విస్తరణకు రూ. 960కోట్లు, ఎల్బీ నగర్ జోన్ లో టీకేఆర్ కాలేజ్ దగ్గర ఫ్లై ఓవర్ , చార్మినార్ జోన్ లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మించనున్నారు.