హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల కోడ్నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు పట్టుకున్న రూ.3.32 కోట్లను సంబంధిత వ్యక్తులకు విడుదల చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 123 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల32లక్షల67వేల435ను హైదరాబాద్జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 129 కేసుల్లో రూ.4కోట్ల48లక్షల63వేల435- సీజ్ చేశామని, 123 కేసుల్లో సరైన డాక్యుమెంట్లు సబ్మిట్చేసినవారికి నగదును విడుదల చేశామన్నారు.
రూ.10 లక్షలకు మించి పట్టుబడిన మూడు కేసుల్లోని రూ.49లక్షల47వేలను ఆదాయ పన్ను, కమర్షియల్ ట్యాక్స్ శాఖలకు రిఫర్ చేసినట్లు తెలిపారు. 3 కేసుల్లో రూ.66లక్షల49వేలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసిందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 9 కేసులు నమోదయ్యాయని, రూ.47లక్షల55వేల815ను పట్టుకున్నామని చెప్పారు. వీరిలో సరైన ఆధారాలు చూపిన ఆరుగురికి గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ.12లక్షల51వేల600 విడుదల చేసినట్లు కమిషనర్తెలిపారు. మూడు కేసులను ఆదాయపన్ను శాఖకు రెఫర్ చేసినట్టు చెప్పారు. సందేహాలు ఉన్నట్లయితే గ్రీవెన్స్ కమిటీ చైర్మన్, అడిషనల్ కమిషనర్ సెల్ నెంబర్ 96188 88110, కమిటీ కన్వీనర్ సెల్ నెంబర్ 91778 72240లో సంప్రదించవచ్చని సూచించారు.