హైదరాబాద్: జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం టెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ 2024 ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆర్.లింబాద్రి ఎగ్జామ్ కన్వీనర్ అరుణకుమారి విడుదల చేశారు. జూన్ 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో 20వేల 626 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 18వేల 829 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
పరీక్ష నిర్వహించిన 4రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు అధికారులు. హైదరాబాదులో 8 సెంటర్ల తో పాటు వరంగల్ లో 7 సెంటర్లలో 19 బ్రాంచ్ లకు సంబంధించి ఈ పరీక్షను నిర్వహించడం జరిగిందని త్వరలోనే అధికారులతో చర్చించి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి తో పాటు ఉన్నత విద్యా మండలి అధికారులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.