- మే 2 నుంచి మే 13 వరకు పదవతరగతి పరీక్షలు
- ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విడుదల చేశారు. గురువారం కర్నూలు నగర శివారు ప్రాంతంలోని ట్రిపుల్ ఐటి కళాశాల సెమినార్ హాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు... కేంద్రం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, జాతీయ పరీక్షలకు ఇబ్బంది లేకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకొని ఈ ఏడాది మే 2 నుంచి మే 13 వరకు పదవతరగతి పరీక్షలుమరియు ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలకు 4,93,967 మంది విద్యార్థులు, 4,92,566 మంది విద్యార్థినిలు వెరసి మొత్తం 9,86,533 మంది పరీక్షలు రాస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందుకోసం 1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. మార్చి 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు 1,62,435 మంది విద్యార్థులు, 1,72,380 మంది విద్యార్థినిలు వెరసి మొత్తం 3,34,815 మంది 1757 పరీక్షా కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే మార్చి 7వ తేదీ ఎథిక్స్ అండ్ హుమాన్ వాల్యూస్, 9వ తేదీ ఎన్విరాన్మెంట్ పరీక్షలు జరుగుతాయన్నారు.
10వ తరగతి పరిక్షల షెడ్యూల్
02.05.2022 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 1 మరియు కంపోజిట్ కోర్స్
04.05.2022 : సెకండ్ లాంగ్వేజ్
05.05.2022 : ఇంగ్లీష్
07.05.2022 : మ్యాథమెటిక్స్
09.05.2022 : ఫిజికల్ సైన్సు
10.05.2022 : బయోలాజికల్ సైన్సు
11.05.2022 : సోషల్ స్టడీస్
12.05.2022 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 2 మరియు కంపోజిట్ కోర్స్
13.05.2022 : OSSC మెయిన్ లాంగ్వేజ్ ( సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్)
ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరిక్షల షెడ్యూల్
08-04-2022 : పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
09-04-2022 : పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
11-04-2022 : పార్ట్-I ఇంగ్లీష్ పేపర్-1
12-04-2022 : పార్ట్ -I ఇంగ్లీష్ పేపర్-2
13-04-2022 : పార్ట్-III మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-I
16-04-2022 : పార్ట్-III మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2
18-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జూవాలాజి పేపర్-1, హిస్టరీ పేపర్-1
19-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జూవాలాజి పేపర్-2, హిస్టరీ పేపర్-2
20-04-2022 : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1,
21-04-2022 : ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
22-04-2022 : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజి పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
23-04-2022 : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజి పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2
25-04-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 ( బి.పి.సి విద్యార్థులకు)
26-04-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-2
( బి.పి.సి విద్యార్థులకు)
27-04-2022 : మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
28-04-2022 : మోడరన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2
కోవిడ్ స్టాండర్డ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎవరికీ అసౌకర్యం కలగకుండా ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సురేష్ వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్ థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరీక్షలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారన్నారు. ప్రతి రోజూ ప్రతి పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే వారందరికీ మాస్కులు అందచేయడంతో పాటు విద్యార్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
లతా మంగేష్కర్ కు ఐక్య రాజ్య సమితి నివాళి
తక్కువ రేట్లకు వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం
లఖీంపూర్ ఖేరి కేసు: కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్