
హైదరాబాద్, వెలుగు: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2023–-24 ఆర్థిక సంవత్సరానికి గాను తన తొలి సస్టయినబిలిటీ రిపోర్ట్‌ను విడుదల చేసింది. యూ సస్టయిన్ పేరుతో దీనిని తీసుకొచ్చింది. స్థిరమైన అభివృద్ధి, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌తో కార్యకలాపాలను ప్రోత్సహించడం బ్యాంక్ ముఖ్య ఉద్దేశం. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో స్థిరమైన బ్యాంకింగ్ అనేది ఒక బాధ్యత మాత్రమే కాదని, తమ షేర్‌హోల్డర్ల దీర్ఘకాలిక విలువను పెంచే మార్గమని బ్యాంక్ డైరెక్టర్ గోవింద్ సింగ్ చెప్పారు. ఈ ఫుల్ రిపోర్ట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.