సింగూరు ప్రాజెక్టు నుండి మంజీర బ్యారేజీకి నీటి విడుదల

సింగూరు ప్రాజెక్టు నుండి మంజీర బ్యారేజీకి నీటి విడుదల

సింగూరు ప్రాజెక్టు నుండి మంజీర బ్యారేజీకి  రెండవ విడత నీటిని విడుదల చేశారు అధికారులు. రెండవ విడతలో భాగంగా  ఘణపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.  యాసంగి పంటలకు సాగునీరు అందించే క్రమంలో 0.35 టీఎంసీ నీటిని విడుదల చేశారు. 

మంజీర బ్యేరేజీకి నీటిని విడుల చేసినందున మంజీర నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పశువులు, గొర్రెల కాపరులు, చేపల వేటకు వెళ్లేవారు నదిలోకి వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు.