కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల

కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల

తిమ్మాపూర్, వెలుగు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి కరీంనగర్‌‌‌‌ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్, రిజర్వాయర్  నుంచి మోయ తుమ్మెద వాగు నుంచి 21,102 క్యూసెక్కులు వచ్చి చేరుతుండడంతో అధికారులు ఆదివారం కాకతీయ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్‪లో 24 టీఎంసీలకు గాను.. 21.102 టీఎంసీలు ఉన్నట్లు ఇరిగేషన్​ఏఈ కిరణ్ కుమార్  తెలిపారు. ఇదిలాఉంటే రిజర్వాయర్ లోకి వరద మరింత పెరిగితే గేట్లు తెరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నదీ పరీవాహక ప్రాంతంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.