LMD కాకతీయ కాలువకు నీటి విడుదల

కరీంనగర్:  LMD కాకతీయ కాలువకు ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట సాగు కోసం నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ శంకర్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వరకు నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. 

భవిష్యత్ అవసరాల దృష్ట్యా రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటి వృధాను అరికట్టాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.