శాలిగౌరారం ఆయకట్టుకు నీటి విడుదల

శాలిగౌరారం( నకిరేకల్), వెలుగు : తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు కలిసి ఆదివారం నీటిని విడుదల చేశారు. తొలుత గంగమ్మ తల్లికి వేద పండితులతో పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి వృథా కాకుండా రైతులకు సాగుకు అందించాలన్నారు. గతంలో కాంట్రాక్టర్లు చేసిన తప్పిదాలను సరిచేయాలన్నారు. తనకు అత్యధికంగా 73 వేల మెజార్టీ ఇచ్చిన తుంగతుర్తి ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.