
నిర్మల్, వెలుగు: యాసంగి పంటల కోసం బుధవారం శ్రీరాంసాగర్జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా సోన్ మండలం గాంధీనగర్ వద్ద ఎమ్మెల్యే మహ్వేశ్వర్రెడ్డి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం సరస్వతి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం పంటల కోసమే నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. చెరువులు నింపుకుని పంటల సాగుకు వినియోగించుకోవాలని సూచించారు.
రైతులకు అండగా ఉంటానని, తన దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నిర్మల్‌జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జ్అయ్యన్న గారి భూమయ్య, మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్, ఎస్ఈ సుశీల్ కుమార్, ఈఈ రమారావు తదితరులు పాల్గొన్నారు.