పెండింగ్ డీఏలు రిలీజ్ చేయండి :  టీఎన్జీవో నేతలు

పెండింగ్ డీఏలు రిలీజ్ చేయండి :  టీఎన్జీవో నేతలు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ డీఏలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను టీఎన్జీవో నేతలు కోరారు. బుధవారం సెక్రటేరియెట్ లో టీజేఎస్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేని మంత్రిని కలిశారు. శుక్రవారం కేబినెట్ మీటింగ్ లో డీఏల అంశంపై చర్చించాలని మంత్రిని నేతలు కోరారు. ఈహెచ్ఎస్, ఉద్యోగుల బదిలీలు, సీపీఎస్ రద్దుతో పాటు ఉద్యోగుల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రికి నేతలు విన్నవించారు. ఈ సమావేశంలో రామినేని శ్రీనివాస్ రావు, ఉమాదేవి పాల్గొన్నారు.