హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉస్మానియాలో 175, గాంధీలో 60 పోస్టులున్నాయి. డిపార్ట్‌మెంట్ వారీగా ఖాళీల వివరాలను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వెబ్‌సైట్‌లో(https://dme.telangana.gov.in/) పొందుపర్చారు. ఈ నెల 8న సాయంత్రం 5 గంటల లోగా అదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అకడమిక్ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా వాక్ ఇన్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసిన వారు ఈ నెల 9న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉస్మానియా, గాంధీకి రావాలని సూచించారు.