ప్రజలకిచ్చిన హామీలు బీఆర్ఎస్ ​నెరవేర్చలేదు: ఆది శ్రీనివాస్​

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేములవాడ, వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా మోసం చేసిన బీఆర్ఎస్​ లీడర్లను గ్రామాల్లోకి రానివ్వద్దని రాజన్నసిరిసిల్ల  డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​ పిలుపునిచ్చారు. మంగళవారం వేములవాడలోని తన నివాసంలో బీఆర్ఎస్, బీజేపీలపై చార్జిషీట్​రిలీజ్ చేశారు. అనంతరం రూరల్​మండలం రుద్రంగిలో పార్టీ బూత్ స్థాయి కమిటీలతో మీటింగ్​నిర్వహించారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ  దళితుకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, లీడర్లు శ్రీనివాస్ గౌడ్, నారాయణ, రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సత్యలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, మనోహర్, మోహన్ రెడ్డి, తిరుపతి, గురవయ్య, ఆగయ్య పాల్గొన్నారు.