- డీల్ విలువ రూ.375 కోట్లు
న్యూఢిల్లీ: అంకాలజీ సేవలు అందించే కార్కినోస్హెల్త్కేర్ను ముకేశ్‌అంబానీకి చెందిన రిలయన్స్గ్రూపు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.375 కోట్లని కంపెనీ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్(ఆర్ఎస్బీవీఎల్) కార్కినోస్ షేర్లను ఈ నెల 27న కొన్నదని రిలయన్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
2020 జులైలో ఏర్పాటైన కార్కినోస్ క్యాన్సర్ నిర్ధారణ, నియంత్రణ సేవలు అందిస్తుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దీని టర్నోవర్ రూ.22 కోట్లు. గత డిసెంబరు నాటికి ఇది 60 హాస్పిటల్స్‌తో క్యాన్సర్గుర్తింపు సేవల ఒప్పందం కుదర్చుకుంది.