రష్యా నుంచి ఒక్క రిలయన్స్‌‌‌‌‌‌‌‌కే ఏడాదికి రూ. 1.10 లక్షల కోట్ల ఆయిల్‌‌‌‌‌‌‌‌!

రష్యా నుంచి ఒక్క రిలయన్స్‌‌‌‌‌‌‌‌కే  ఏడాదికి రూ. 1.10 లక్షల కోట్ల ఆయిల్‌‌‌‌‌‌‌‌!
  • రోస్నెఫ్ట్‌‌‌‌‌‌‌‌తో అగ్రిమెంట్ 

న్యూఢిల్లీ: రష్యా నుంచి ఏడాదికి 13 బిలియన్ డాలర్ల (రూ.1.10 లక్షల కోట్ల) విలువైన క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ రెడీ అయ్యింది.  రష్యా ప్రభుత్వ సంస్థ రోస్నెఫ్ట్‌‌‌‌‌‌‌‌తో  అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  రోజుకి 5,00,000 బ్యారెల్స్‌‌‌‌‌‌‌‌ను రోస్నెఫ్ట్‌‌‌‌‌‌‌‌ సప్లయ్ చేయనుందని, పదేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకుందని తెలిపారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై దాడి చేసినందుకు రష్యాపై యూఎస్‌‌‌‌‌‌‌‌, యూకే, కెనడా వంటి వెస్ట్రన్‌‌‌‌‌‌‌‌ దేశాలు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే.  అయినప్పటికీ ఇండియా పెద్ద మొత్తంలో  రష్యా ఆయిల్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేస్తోంది. 

తాజా డీల్‌‌‌‌‌‌‌‌పై రోస్నెఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్పందించలేదు. రష్యాతో సహా వివిధ దేశాల సప్లయర్లతో కలిసి పనిచేస్తున్నామని  రిలయన్స్ కామెంట్ చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌  తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రష్యా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ వ్లాదిమిర్ పుతిన్ ఇండియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు ఇరు దేశాల కంపెనీల మధ్య ఈ డీల్ కుదరడం విశేషం. సౌదీ అరేబియాతో సహా మిగిలిన మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఆయిల్ దిగుమతులను ఇండియా తగ్గించుకుంటుండగా, ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో రష్యా నుంచి పెంచుకుంటోంది.