హైదరాబాద్, వెలుగు: వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. సీఎంఆర్ఎఫ్కు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు విరాళం అందించింది. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నీతా అంబానీ తరఫున చెక్ ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. దీంతో పాటు భార త్ బయోటెక్ సీఎంఆర్ఎఫ్కి రూ.కోటి విరాళం అందజేసింది. సీఎంను కలిసి భారత్ బయోటెక్ కో- ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా కలిసి చెక్ ను అందజేశారు.