గ్యాస్​ తీసినందుకు రూ.24,500 కోట్లు కట్టండి

గ్యాస్​  తీసినందుకు రూ.24,500 కోట్లు కట్టండి
  • రిలయన్స్, బీపీలను ఆదేశించిన ప్రభుత్వం 

న్యూఢిల్లీ:  ఓఎన్​జీసీ సమీప బ్లాక్​ నుంచి సహజ వాయువును ఉత్పత్తి చేయడం,  అమ్మడం ద్వారా భారీ లాభాలను ఆర్జించినందుకు  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బ్రిటిష్​పెట్రోలియం (బీపీ)లు 2.81 బిలి యన్ డాలర్లు (సుమారు రూ. 24,500 కోట్లు) చెల్లించాలంటూ కేంద్రం డిమాండ్ నోటీసు పంపింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసు జారీ అయింది. ఓఎన్​జీసీ సమీప బ్లాకుల నుంచి గ్యాస్​ తీసుకున్నందుకు ఇవి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. 

హైకోర్టు ఈ తీర్పును తోసిపుచ్చింది. దీంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ డిమాండ్ ​నోటీసులు పంపిందని రిలయన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌లో తెలిపింది. కేడీజీ–6లో రిలయన్స్​కు 60 శాతం వాటా ఉండగా, బీపీకి 30 శాతం,  కెనడియన్ సంస్థ నికోకు మిగిలిన 10 శాతం వాటా ఉంది. తదనంతరం రిలయన్స్,  బీపీలు.. నికో వాటాను స్వాధీనం చేసుకున్నాయి.