
న్యూఢిల్లీ: రిలయన్స్‌కు చెందిన జియో... మోటివ్ పేరుతో ఓబీడీ (ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్) డివైజ్‌ను లాంచ్ చేసింది. ధర రూ.ఐదు వేలు. దీనిని కారులోని ఓబీడీ పోర్టుకు కనెక్ట్ చేయాలి. ఇది వెహికల్ కండిషన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంది. వెహికల్లోని సమస్యల గురించి రియల్‌టైం డేటాను అందిస్తుంది.
మెయింటనెన్స్, రిపెయిర్స్వంటి ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేస్తుంది. జియో-ఫెన్సింగ్‌తో వెహికల్‌కు సరిహద్దులను సెట్ చేయవచ్చు. డ్రైవర్ వాటిని దాటితే హెచ్చరికలు వస్తాయి. లొకేషన్ గురించి మీకు ఎల్లప్పుడూ తెలియజేస్తుంది. బ్యాటరీ వోల్టేజ్, ఇంజిన్ టెంపరేచర్వివరాలనూ యజమానికి మొబైల్ యాప్ ద్వారా పంపిస్తుంది.