ద్వారక ఆలయంలో ముఖేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్​అధినేత ముకేశ్​అంబానీ (Mukesh Ambani) దేవ్‌భూమి (Devbhumi )ని సందర్శించారు. అక్కడ ద్వారకాధీశుని ఆలయం (Dwarkadhish Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ముకేశ్‌ అంబానీ.. తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani )తో కలిసి గుజరాత్‌ రాష్ట్రం దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు  వెళ్లారు. అక్కడ ఉన్న ద్వారకాధీశుని ఆలయాన్ని సందర్శించారు. ద్వారకాధీశుని పాదాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీకి శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది