వచ్చే మార్చిలోపే రిలయన్స్ గిగా ఫ్యాక్టరీ అందుబాటులోకి

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ మొదటి సోలార్ గిగా ఫ్యాక్టరీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తేవాలని చూస్తోంది. మొదటగా  20 గిగావాట్ల సోలార్ పీవీ (ఫోటోవోల్టాయిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  వచ్చే ఏడాది మార్చి లోపు ప్రారంభిస్తామని తన యాన్యువల్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలయన్స్ పేర్కొంది. దశల వారీగా ఈ ఫ్యాక్టరీ తయారీ సామర్ధ్యాన్ని పెంచుతామని తెలిపింది. 

ఈ సోలార్ గిగా ఫ్యాక్టరీలో  పీవీ మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలీసిలికాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాఫర్లు , గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వాటిని ఒకేచోట తయారు చేయనున్నారు. అంతేకాకుండా సోడియం అయాన్ సెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీని కూడా 2025 నాటికి ఈ ఫ్యాక్టరీలో చేపట్టాలని, 2026 లో ఏడాదికి 50 మెగావాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిథియం బ్యాటరీ సెల్స్ తయారీని ప్రారంభించాలని రిలయన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది.