Jio AirFiber హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించడానికి 5G టెక్నాలజీతో జియో నుంచి వస్తున్న కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్. Jio AirFiber 1 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగలదు.
ఎయిర్‌ఫైబర్ సాధారణ బ్రాడ్‌బ్యాండ్ కంటే కొంచెం ఖరీదైనది అయినప్పటికీ వినియోగదారులకు ఎంటర్ టైన్ మెంట్, బ్రాడ్ బ్యాండ్, డిజిటల్ సేవలను ఓ గొడుగు కింద అందిస్తుంది. ఆగస్టులో జియో ఎయిర్ ఫైబర్ ను ప్రకటించింది జియో నెట్ వర్క్. ఇప్పడు జియో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఫుణె వంటి ఎనిమిది ప్రధాన నగరాల్లో గణేష్ చతుర్థి సందర్బంగా జియ్ ఎయిర్ ఫైబర్ సేవలను మంగళవారం ( సెప్టెంబర్ 19) ప్రారంభించింది.
జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఎలా పొందాలి ?
జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ కావాలనుకున్న వారు వాట్సప్ లో 60008-60008 కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారాగానీ, జియో వెబ్ సైట్ లో లాగిన్ అవ్వడం ద్వారాగానీ, సమీప జియో స్టోర్ కు వెళ్లి కూడా జియో ఎయిర్ ఫైబర్ సేవల కొరకు నమోదు చేసుకోవచ్చు.
ఇప్పటికే Jio Fiber ఉంటే Jio Air Fiber పొందడం ఎలా ?
Jio Air Fiber అనేది కస్టమర్లకు అదనపు నాణ్యతగల వైర్ లెస్ బ్యాకప్ సర్వీస్.. మీరు ఇప్పటికే Jio Fiber కలిగి ఉంటే ఎంటర్ టైన్ మెంట్ ఉపయోగించుకోవచ్చు.
Jio Air Fiber ఇన్ స్టాలేషన్ ప్రక్రియ
Jio Air Fiber ను టెర్రస్, రూఫ్ టాఫ్ లేదా ఇంటి వెలుపల అవుట్ డోర్ యూనిట్గా ఇన్ స్టా్ల్ చేయబడుతుంది. ఇన్ స్టాలేషన్ కు రూ. 1000 ఛార్జ్ చేస్తారు. సంవత్సర ప్లాన్ తీసుకుంటే ఇన్ స్టాలేషన్ ఛార్జ్ ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా నెలవారీ EMI చెల్లించడం ద్వారా కూడా ఇన్ స్టాలేషన్ ఛార్జ్ ఉండదు.
Jio Air Fiber ప్రయోజనాలు
Jio Air Fiber ద్వారా 550+ డిజిటల్ టీవీ ఛానెల్స్, 16+ OTT యాప్ లు, ఇండోర్ WiFi సర్వీస్, రూటర్లు, 4k స్మార్ట్ సెట్ టాప్ బాక్స్ లను అదనపు ఖర్చు లేకుండా అందిస్తారు..