మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 స్టా్ర్ట్ కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 7 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ చందాదారుల కోసం కొత్త డేటా ప్లాన్‌ను ప్రకటించింది.
రూ.49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌తో 25 GB డేటాను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది డేటా వోచర్, కాబట్టి దీన్ని ఉపయోగించడానికి బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. దీని వాలిడిటీ ఒకరోజు మాత్రమే ఉంటుంది. ఇదే ప్లాన్‌ను ఎయిర్‌టెల్ కూడా ఆఫర్ చేస్తోంది. కానీ 20 GB డేటాను మాత్రమే అందిస్తుంది.
జియో తన క్రికెట్ ప్లాన్ కింద మరొక రెండు ప్లాన్‌ను కలిగి ఉంది. మొదటిది రూ.667 ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. దీంట్లో వాయిస్ కాలింగ్, ఎసెమ్మెస్ వంటి ప్రయోజనాలేమీ ఉండవు. పైగా యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే దీన్ని రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 150 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి ఏమీ ఉండదు. కావాలంటే మొత్తం ఒకేసారి వాడుకోవచ్చు. మరోవైపు రూ.444 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు. దీనికీ బేస్ ప్లాన్ ఉండాల్సిందే.