జియోకి 8 ఏళ్లు..కొన్ని  ప్లాన్లపై డిస్కౌంట్స్‌‌‌‌

జియోకి 8 ఏళ్లు..కొన్ని  ప్లాన్లపై డిస్కౌంట్స్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం నెట్‌‌‌‌వర్క్ రిలయన్స్ జియో వచ్చి గురువారంతో  ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2016, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 05న  కంపెనీ సర్వీస్‌‌‌‌లు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఎనిమిదో యానివర్సరీ సందర్భంగా జియో కొన్ని ప్లాన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.  సెప్టెంబర్ 05, సెప్టెంబర్ 10 మధ్య  ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. మూడు నెలల ప్లాన్స్ అయిన రూ.899, రూ.999, అలానే యాన్యువల్ ప్లాన్ రూ.3,599 పైన  రూ.700 వరకు బెనిఫిట్స్ పొందొచ్చని జియో ప్రకటించింది.

10 ఓటీటీ సబ్‌‌‌‌స్క్రిప్షన్స్‌‌‌‌, 28 రోజుల వ్యాలిడిటీ ఉండే రూ.175 విలువైన 10 జీబీ  డేటా, మూడు నెలల జొమాటో గోల్డ్‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ వంటి బెనిఫిట్స్‌‌‌‌ను జియో అందిస్తోంది. ప్రస్తుతం రూ.899 ప్లాన్‌‌‌‌పై రోజుకి 2జీబీ డేటా, అన్‌‌‌‌లిమిటెడ్ కాల్స్‌‌‌‌, 90 రోజుల వ్యాలిడిటీ వస్తోంది. అదే రూ.999 ప్లాన్‌‌‌‌పై రోజుకి 2 జీబీ డేటా, అన్‌‌‌‌లిమిటెడ్ కాల్స్‌‌‌‌, 98 రోజుల వ్యాలిడిటీ వస్తోంది. యాన్యువల్ ప్లాన్ రూ.3,599 తో అయితే రోజుకి 2.5 జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తున్నారు. .

జియో సునామి..

గత ఎనిమిదేళ్లలో దేశంలోనే అతిపెద్ద  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌గా జియో ఎదగగలిగింది. లాంచ్ అయిన 170 రోజుల్లోనే 10 కోట్ల కస్టమర్లను దక్కించుకుంది.  అంటే ప్రతీ సెకెండ్‌‌‌‌కు ఏడుగురు కస్టమర్లను పొందింది. ప్రస్తుతం జియో కస్టమర్లు 49 కోట్లకు పెరగగా, ఇందులో 13 కోట్ల మంది 5జీ యూజర్లు ఉండడం విశేషం. జియో రాకతో ఒక జీబీ డేటా  ఖర్చు 30 రెట్లు తగ్గింది. అలానే  డేటా వినియోగం 73 రెట్లు పెరిగింది.  

2జీ  నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలనే టార్గెట్‌‌‌‌తో వచ్చిన జియో, 4జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ విస్తరించడంలో కీలకంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 60 శాతం డేటా వాడకం జియో నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ పైనే జరుగుతోంది.  ఈ కంపెనీ తాజాగా జియో ఫోన్‌‌‌‌, జియో భారత్‌‌‌‌, జియో ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫైబర్‌‌‌‌‌‌‌‌, 5జీ సర్వీస్‌‌‌‌లను అందుబాటులోకి తెచ్చింది.  జియో భవిష్యత్‌‌‌‌లో  ఏఐ, డీప్‌‌‌‌టెక్‌‌‌‌తో మరింత విస్తరిస్తుందని  రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.