
ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. జియోహాట్‌స్టార్‌లో ఐపీఎల్ 2025 ను ఉచితంగా చూసే ప్రత్యేక టారిఫ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో సంస్థ సోమవారం(మార్చి 17) ప్రకటించింది. జియో సిమ్ యూజర్లు రూ.299 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే రాబోయే రెండున్నర నెలల పాటు తమ వినియోగదారులు ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించవచ్చని వెల్లడించింది. ఈ ఛాన్స్ తీసుకున్న యూజర్లు మార్చి 22 నుంచి మొదలయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లు 74 వరకు ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు.
అంతేకాదు, ఇంకో పెద్ద ఆఫర్ కూడా ఉంది. ఎవరైనా కొత్త జియో సిమ్ తీసుకుని రూ. 299తో రీఛార్జ్ చేసుకుంటే, వాళ్లకు 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ ఆఫర్ ద్వారా ఐపీఎల్ సీజన్ మొత్తం చూడొచ్చు. ఈ ఆఫర్ ద్వారా రిలయన్స్, డిస్నీల సహకారంతో కొత్తగా విలీనం చేయబడిన జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోని మ్యాచ్‌లను చూడటానికి వినియోగదారులకు అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read:-ఛాంపియన్స్ ట్రోఫీతో పాకిస్తాన్‌కు రూ.739 కోట్లు నష్టం..
ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మే 25 న ఫైనల్ తో ముగిస్తుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్ వేదిక. కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానం, ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్-హెడర్ మ్యాచ్‌లు. గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్‌తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది.