వచ్చే ఏడాది జియో ఐపీఓ!

వచ్చే ఏడాది జియో ఐపీఓ!

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో వచ్చే ఏడాది మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.  కంపెనీ వాల్యుయేషన్100 బిలియన్ డాలర్ల (రూ.8.30 లక్షల కోట్ల) పైన  ఉంటుందని అంచనా. జెఫరీస్ ఈ కంపెనీ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 110 బిలియన్ డాలర్లుగా లెక్కించింది. మర్చంట్ బ్యాంకర్ల లెక్కలు రావాల్సి ఉంది. కానీ,  రిలయన్స్ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓ మాత్రం ఇప్పటిలో ఉండకపోవచ్చు.  రిలయన్స్ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జియో వచ్చే ఐదేళ్లలో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అవుతాయని 2019 ఏజీఎంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెలికం, రిటైల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వాటాలను  కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనరల్ అట్లాంటిక్, అబుదాబి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ వంటి టాప్ ఇన్వెస్టర్లకు  100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్ దగ్గర అమ్మి,  25 బిలియన్ డాలర్ల ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సేకరించింది.

 జియో బిజినెస్ నిలకడగా ఉందని, 47.9 కోట్ల యూజర్లతో  కంపెనీ  నెంబర్ వన్ టెలికం కంపెనీగా ఎదిగిందని  ఎనలిస్టులు పేర్కొన్నారు. దీంతో ఈ కంపెనీని ఐపీఓకి తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తోందని అన్నారు. కానీ, కొన్ని ఇంటర్నల్ సమస్యల కారణంగా రిటైల్ బిజినెస్ ఐపీఓ  2025 తర్వాతే ఉండొచ్చని అన్నారు.