ప్రముఖ టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో ఎలక్ట్రిక్ కార్లకోసం కొత్త ప్రాడక్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే Jio EV Aries యూనివర్సల్ టైప్ 2 ఛార్జింగ్ కనెక్టర్. ఈ ప్రాడక్ట్ అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లకు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఇది కామర్స్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.JioEV Aries గురించి పూర్తి వివరాలు మీ కోసం..
ఎలక్ట్రిక్ కార్ల కోసం JioEV ఏరీస్ ఛార్జర్ CE, ARAI సర్టిఫికేషన్ పొందింది. ఇది 7.4 kW ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఎలక్ట్రిక్ వాహనాలను రాత్రిపూట ఛార్జింగ్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు 3.3kW ఛార్జర్ తో పోల్చినపుడు జియో కొత్త EV ఛార్జర్ ఛార్జింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఛార్జర్ ప్రస్తుతం రూ. 46వేల 499 ధరతో అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ ఛార్జర్ వాటర్ , డస్ట్ ఫ్రూఫ్ లను కలిగిఉంది. ఇది ఎటువంటి ప్రతికూల వాతావరణంలో కూడా ఎక్కువ కాలం పనిచేస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాలను (EV) సురక్షితంగా ఉంచడానికి JioEV ఏరీస్ 360 డిగ్రీలకోణంలో పర్యవేక్షణను కలిగి ఉంటుంది. ఇది ఇంటర్న్ RCD, ఓవర్‌కరెంట్ ప్రొటెక్షన్, ఓవర్‌వోల్టేజ్ ప్రొటెక్షన్, అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, రెసిడ్యూవల్ కరెంట్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్-టెంపరేచర్ ప్రొటెక్షన్, గ్రౌండ్ ఫాల్ట్ ప్రొటెక్షన్ , ఇంటిగ్రేటెడ్ సర్జ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లతో వస్తుంది.
JioEV ఏరీస్ ఛార్జర్ వాల్‌బాక్స్ బరువు 3.75 కిలోలు , దీనినిగోడ, స్తంభం లేదా పోల్‌పై ఎక్కడైనా అమర్చవచ్చు. ఇది RFID టెక్నాలజీతో కూడిన ప్లగ్ అండ్ ప్లే పరికరం. కస్టమర్లు RFID ద్వారా విద్యుత్ సరఫరా కూడా పొందవచ్చు.