
క్రికెట్ అభిమానులు, మూవీ లవర్స్ కోసం జియో ఒక సరికొత్త రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. జియో ప్రీపెయిడ్ కస్టమర్లు 195 రూపాయల డేటా ప్యాక్తో రీఛార్జ్ చేసుకుంటే 15 జీజీ హై స్పీడ్ డేటాతో పాటు 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను పొందొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్ సీజన్ 18 మ్యాచులతో పాటు హాట్ స్టార్లో ఉన్న సినిమాలను, వెబ్ సిరీస్లను 3 నెలల పాటు ఆస్వాదించవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. జియో తీసుకొచ్చిన ఈ డేటా ప్యాక్తో రీఛార్జ్ చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ను పొందే అవకాశం ఉంది. యూజర్లు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కేవలం మొబైల్కు మాత్రమే.
📢📢📢 Jio New Plan Update :
— DealBee Deals (@DealBeeOfficial) February 24, 2025
Rs 195 Plan - 15GB data + FREE JioHotstar Mobile subscription for 90 days! 🥳
✅ Only Data Pack - No Calls/SMS ❌ pic.twitter.com/4vcmknBicA
ఇది మాత్రమే కాదు.. జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్తో కూడిన లాంగ్ టర్మ్ డేటా ప్లాన్ కూడా జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. జియో ప్రీపెయిడ్ సిమ్ వినియోగదారులు 949 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జీబీ హై స్పీడ్ 5జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు 84 రోజుల పాటు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా పొందొచ్చని జియో పేర్కొంది. బడ్జెట్ను బట్టి 195 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలో, 949 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలో కస్టమర్లు డిసైడ్ అవ్వొచ్చు.
క్రికెట్ అభిమానులకు సీజన్ టైం వచ్చేసింది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ 18 మొదలవుతుంది. ఇలా.. మూడు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండగ వచ్చేసింది. ఇండియాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్ సీజన్ 18 మ్యాచ్లు జియో హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. జియో హాట్ స్టార్లో ఈ మ్యాచ్లను వీక్షించాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి.
ALSO READ : 54 ఏండ్ల తర్వాత పాక్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం షురూ
ఐపీఎల్ మ్యాచ్లు చూడాలంటే కనీసం రూ.149 ప్లాన్తో జియో హాట్ స్టార్ రీఛార్జ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే బదులు.. ఐపీఎల్ మ్యాచులు, హాట్ స్టార్లో సినిమాలు వీక్షించాలనుకునే వాళ్లు జియో డేటా ప్లాన్స్ తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. రిలయన్స్కు చెందిన వయాకామ్, స్టార్ ఇండియా విలీనం వల్ల జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ కలిసి జియో హాట్ స్టార్ యాప్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.