జియో యూజర్లకు పండగే.. 11 రూపాయలకే 10 GB హైస్పీడ్ డేటా

జియో యూజర్లకు పండగే.. 11 రూపాయలకే 10 GB హైస్పీడ్ డేటా

దేశీయ అతి పెద్ద ప్రైవేట్ టెలికామ్ నెట్ వర్క్ రిలయన్స్ జియో తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. నమ్మశక్యం కాని ఓ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఆ రీఛార్జ్ ప్లాన్‌ ఏంటంటారా..! కేవలం 11 రూపాయలకే 10 GB హై-స్పీడ్ డేటా అందిస్తోంది. కాకపోతే, ఈ ప్లాన్‌లో ఓ ట్విస్ట్ ఉంది.

డేటాపై ఎక్కువగా ఆధారపడే వినియోగదారులే లక్ష్యంగా జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌ తీసుకొచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే రోజువారీ డేటా పరిమితి అయిపోయాక 1 GB డేటా కావాలంటే.. ఎంతలేదన్నా రూ. 20 వెచ్చించాలి. అలాంటిది 11 రూపాయలకే 10 GB హై-స్పీడ్ డేటా అంటే ఇందులో ఉన్న మర్మమేంటో గమనించాలి. 10GB డేటాను కేవలం గంటలోపు ఉపయోగించాలి. ఇదే ఇందులో ఉన్న ట్విస్ట్. గంటలోపు 10GB డేటా వాడటం అంటే దాదాపు అసంభవమే. ఒకేసారి ఐదారు సినిమాలు డౌన్‌లోడ్ చేస్తే తప్ప ఇంత డేటా ఖర్చవ్వడం కష్టం. ఏదేమైనా అధిక డేటా అవసరమైన వారు ఈ ప్లాన్ ఉపయోగించుకోండి.

ఎయిర్‌టెల్‌లోనూ ఇదే ప్లాన్

మరో ప్రైవేట్ టెలికామ్ నెట్ వర్క్ భారతీ ఎయిర్‌టెల్ సైతం ఇదే ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం11 రూపాయలకు 10GB డేటా అందిస్తోంది.  కాకపోతే, గంటలోపు వాడేయాలి. లేదంటే ఎక్సపైరీ అవుతుంది.

 239 రీఛార్జ్ ప్లాన్ ఉత్తమం

తక్కువధరలో జియో రీఛార్జ్ ప్లాన్ అంటే.. రూ. 239 అని చెప్పుకోవాలి. ఈ ప్లాన్ భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్‌ను అందిస్తుంది. వ్యాలిడిటీ 22 రోజులు. రోజుకు 1.5GB డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMSలు పంపుకోవచ్చు.