కస్టమర్లకు జియో ఝలక్.. రీఛార్జ్ ప్లాన్స్లో కీలక మార్పులు.. గట్టి దెబ్బే ఇది..!

కస్టమర్లకు జియో ఝలక్.. రీఛార్జ్ ప్లాన్స్లో కీలక మార్పులు.. గట్టి దెబ్బే ఇది..!

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రెండు డేటా ప్లాన్స్ వ్యాలిడిటీలో మార్పులు చేసింది. 69 రూపాయలు, 139 రూపాయల డేటా యాడ్-ఆన్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఇప్పటివరకూ మన ప్రస్తుత ప్లాన్ గడువు ఉన్నంత వరకూ ఉండేది. కానీ.. ఇకపై అలా కాదు.. మీ ప్రస్తుత ప్లాన్ గడువు సంవత్సరం ఉన్నా 69 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీకి సంబంధం లేదు. 

69 రూపాయల డేటా ఓన్లీ ప్యాక్ను రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ 7 రోజులు మాత్రమే. 6 జీబీ హై స్పీడ్ డేటా పొందొచ్చు. 139 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 12 జీబీ డేటా.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 7 రోజులు మాత్రమే. ఇవి రెండూ డేటా ఓన్లీ ప్యాక్స్ మాత్రమే. ఎలాంటి వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెన్ఫిట్స్ రావు.

కస్టమర్లకు ఈ రెండు డేటా ప్యాక్స్ వ్యాలిడిటీని 7 రోజులకే పరిమితం చేయడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే.. ఒక్కోసారి ప్రస్తుత ప్లాన్లో అందుబాటులో ఉండే డేటాతో కాకుండా అదనపు డేటా అవసరం పడుతుంటుంది. అలాంటి సమయంలో ఈ రెండు ప్లాన్స్లో ఏ ప్యాక్తో రీఛార్జ్ చేసుకున్నా మన వాయిస్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంతవరకూ వ్యాలిడిటీ కొనసాగేది. కానీ.. ఇప్పుడు అలా కాదు. కేవలం 7 రోజుల లోపే ఆ 6 జీబీ డేటాను గానీ, 12 జీబీ డేటాను గానీ వాడుకోవాలి. ఆ తర్వాత ప్లాన్ వ్యాలిడిటీ ముగుస్తుంది.

ALSO READ | జియో హాట్స్టార్ వచ్చేసింది.. 3 నెలల ప్లాన్ ఎంతంటే..

రీచార్జ్‌‌‌‌ రేట్లను రిలయన్స్ జియో భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అన్ని ప్లాన్ల ధరలు 25% వరకు పెరిగాయి. సవరించిన రేట్లు 2024, జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒకప్పుడు 28 రోజుల వ్యాలిడిటీ ఉండి, అన్‌‌‌‌లిమిటెడ్  వాయిస్, ఎస్‌‌‌‌ఎంఎస్, 2జీబీ  డేటా అందించే నెలవారీ ప్లాన్ ధర రూ.155గా ఉంది. దీనిని జియో రూ.189కి పెంచింది. అలానే రోజుకి  1.5 జీబీ డేటా, అన్‌‌‌‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ అందించే 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ రేటును రూ.209 నుంచి రూ.299 కి పెంచింది.