న్యూఢిల్లీ: మీడియా సెక్టార్‌లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా మీడియా ఇంటెలిజెన్స్ కంపెనీ విజికీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచింది. ఈ ఏడాది రిలయన్స్‌కు 100కు 97.43 న్యూస్ స్కోర్ వచ్చింది.
కిందటేడాది ఈ నెంబర్ 96.46 గా ఉంది. ఎంత మేర న్యూస్ పబ్లిష్ చేశారు, హెడ్‌లైన్ ఇంపాక్ట్, పబ్లికేషన్ ఎంతమందికి చేరువవుతోంది, రీడర్‌షిప్ ఎలా ఉంది.. వంటి అంశాల ఆధారంగా న్యూస్ స్కోర్‌ను లెక్కించారు. గత ఐదేళ్లుగా విజికీ న్యూస్ స్కోర్‌లో రిలయన్స్ టాప్‌లో నిలుస్తోంది. ఇతర సెక్టార్లలో టాప్‌లో ఉన్న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పేటీఎం, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో కంటే ఎక్కువ స్కోర్‌ను రిలయన్స్ సాధించింది.