రిటైల్‌ వేర్​హౌసింగ్​ కోసం రిలయన్స్​ ఇన్విట్..​మానిటైజేషనే టార్గెట్‌..

ముంబై: రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్) కొత్తగా ఒక ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఇన్వెస్ట్​మెంట్​ ట్రస్ట్​ (ఇన్విట్​) ఏర్పాటు చేసే ప్రాసెస్​ మొదలెట్టింది. వేర్​హౌసింగ్​, లాజిస్టిక్స్​ ఎసెట్ల మానిటైజేషన్​ కోసమే ప్రత్యేకంగా ఈ ఇన్విట్​పెడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్​ గ్రూప్​లోని కంపెనీ రిలయన్స్​ రిటైల్‌​ ఫిబ్రవరి నెలలోనే  ఒక ట్రస్ట్​ను సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్చేంజ్​ బోర్డ్​ ఆఫ్​ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టర్​ చేసిందని కూడా వర్గాలు తెలిపాయి. 

రిలయన్స్​ గ్రూప్​ మానిటైజ్​ చేయాలనుకుంటున్న వేర్​హౌస్​ ఎసెట్స్ అన్నింటినీ ఈ ట్రస్ట్​ స్టోర్​ చేయనుంది. ఒక మీడియా రిపోర్టు ప్రకారం ఈ ఇన్విట్​కు బదిలీ చేసే ఎసెట్ల విలువ రూ. 19,000 నుంచి రూ.25,000 కోట్ల దాకా ఉండొచ్చు. ఆపరేషన్​లోకి వచ్చాక మరికొన్ని కొత్త ఎసెట్లను యాడ్​ చేస్తారు. రిలయన్స్​ రిటైల్​కి ఈ విషయంపై పంపిన ఈమెయిల్​కి జవాబు రాలేదు. వివిధ రంగాలలో భారీగా విస్తరిస్తున్న రిలయన్స్​  వేర్​హౌసింగ్​, సప్లయ్​ చెయిన్​, లాజిస్టిక్స్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అండ్​ ఫెసిలిటీస్​లలో పెద్ద మొత్తంలోనే పెట్టుబడులను పెడుతోంది. 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేర్​హౌస్​లు ఏర్పాటవుతున్నట్లు డిసెంబర్​ క్వార్టర్​ రిజల్ట్స్​ సందర్భంగా రిలయన్స్​ వెల్లడించింది. దీంతో మొత్తం వేర్​హౌస్​ , ఫుల్​ఫిల్​మెంట్​ ఎసెట్లు 3.36 కోట్ల చదరపు అడుగులకు చేరాయని పేర్కొంది. ​