సంస్థల కొనుగోలుకు.. రిలయన్స్​పెట్టుబడి 13 బిలియన్​ డాలర్లు

సంస్థల కొనుగోలుకు.. రిలయన్స్​పెట్టుబడి 13 బిలియన్​ డాలర్లు

న్యూఢిల్లీ: రిలయన్స్​ ఇండస్ట్రీస్​ గత ఐదేళ్లలో వివిధ కంపెనీల కొనుగోలు కోసం 13 బిలియన్​ డాలర్లను ఖర్చుచేసినట్టు వెల్లడయింది. ఈ డబ్బుతో టెలికం, రిటైల్​, మీడియా వ్యాపారాలను కొన్నది. అంకాలజీ సేవలను అందించే కార్కినోస్​ను  గత వారం రూ.375 కోట్లకు సొంతం చేసుకోవడం ద్వారా డిజిటల్​హెల్త్​కేర్​సిస్టమ్​లోకి కూడా అడుగుపెట్టింది. 

మీడియా, ఎడ్యుకేషన్​ బిజినెస్​ల కోసం ఆరు బిలియన్​ డాలర్లు, టెలికం, ఇంటర్నెట్​వర్టికల్స్​ కోసం 2.6 బిలియన్​ డాలర్లు, న్యూ ఎనర్జీ కోసం 1.7 బిలియన్​ డాలర్లు, రిటైల్​ కోసం 1.14 బిలియన్​ డాలర్లను ఖర్చు చేసిందని మోర్గన్​ స్టాన్లీ వెల్లడించింది.  కేబుల్​టీవీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు హాత్​వే కేబుల్​, డాటాకామ్​ లిమిటెడ్​ను 981 మిలియన్​ డాలర్లకు కొనుగోలు చేసింది.  

సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ ఆర్​ఈసీ సోలార్ హోల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడానికి  771 మిలియన్​ డాలర్లు, పరిశోధన, డేటాబేస్ సంస్థ జస్ట్​డయల్​ కొనుగోలు కోసం మరో 767 మిలియన్​ డాలర్లను ఇన్వెస్ట్​చేసింది.