నిజామాబాద్: వినాయక్ నగర్‌లోని రిలయన్స్ మాల్‌లో కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఎక్స్‌ఫైరీ అయ్యిన వస్తువులు అమ్ముతున్నారంటూ రిలయన్స్ సిబ్బందికి వ్యతిరేకంగా కస్టమర్లు నినాదాలు చేశారు.
డేట్ అయిపోయిన కూరగాయలు, పళ్ల మీద ఉన్న స్టిక్కర్లు చింపి రిలయన్స్ సిబ్బంది విక్రయాలు సాగిస్తున్నట్లు వినియోగదారులు కనుగొన్నారు. దీనిపై సిబ్బందిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కష్టమర్లు మరింత ఆగ్రహానికి గురయ్యారు. గడువు ముగిసిన వాటిపై ఉన్న స్టిక్కర్లు చింపి ఎలా విక్రయాలు సాగిస్తున్నారంటూ కస్టమర్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొన్ని వస్తువలపై స్టిక్కర్లు ఉన్నా.. అవి గడువు ముగిసినవి కావడం గమనార్హం.
బయట పడేయడానికి అక్కడ ఉంచామని సిబ్బంది చెప్తున్నా.. కొనుగోలు చేసేందుకు ఫ్రెష్‌గా ఉన్నవి ఎక్కడని అడిగితే సమాధానాలు దాట వేశారు. ఎక్స్‌ఫైరీ వాటిని అమ్మి ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కస్టమర్లు రిలయన్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాల్‌కి వెళ్లే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆందోళన చేస్తున్న వారు సూచించారు. గతంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని వారు మీడియా దృష్టికి తీసుకొచ్చారు.
డేట్ అయిపోయిన కూరగాయలు, పళ్ల మీద ఉన్న స్టిక్కర్లు చింపి రిలయన్స్ సిబ్బంది విక్రయాలు సాగిస్తున్న రిలయన్స్ స్టాఫ్#RelianceFresh #Nizamabad #RelianceMall pic.twitter.com/InU9Us28md
— తెనాలి రామకృష్ణుడు (@vikatakavi369) December 17, 2024