రిలయన్స్ టెలికం కంపెనీ జియో ‘ఎయిర్‌ఫైబర్’ పేరుతో అందిస్తున్న 5జీ ఫిక్స్‌డ్ -వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్ ఇప్పుడు 115 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంది. వైర్డ్ కనెక్షన్‌లను ఇవ్వడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో ఇది వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ పోర్టబుల్ వైర్‌లెస్ డివైజ్‌తో గరిష్టంగా 1.5 జేబీపీఎస్ వరకు నెట్ స్పీడ్‌ను పొందవచ్చు. రిలయన్స్ జియో తన ఎయిర్‌ఫైబర్ సేవలను సెప్టెంబర్ 19, 2023న ఎనిమిది నగరాలతో ప్రారంభించింది. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లోని 115 నగరాలకు ఈ సేవను విస్తరించింది. తెలంగాణలో హైదరాబాద్, ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్, నిజామాబాద్, పాల్వంచ, పెద్దపల్లి, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, తాండూరు, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో ఎయిర్ ఫైబర్ అందుబాటులో ఉంది. ప్లాన్ల ధరలు రూ.600 నుంచి రూ.నాలుగు వేల వరకు ఉంటాయి.
ALSO READ : డోర్నకల్ బీజేపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ నేతల దాడి