
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ–స్పోర్ట్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన సబ్సిడరీ కంపెనీ రైజ్ వరల్డ్‌వైడ్, బ్లాస్ట్ ఈ–స్పోర్ట్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఫ్యాన్స్, ప్లేయర్లు, బ్రాండ్ల కోసం బ్లాస్ట్ గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) లను ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకొస్తుంది.
ఇక్కడ ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్లను నిర్వహిస్తుంది. బ్లాస్ట్ ఏపీఎస్ సబ్సిడరీ కంపెనీ బ్లాస్ట్. ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్న అతిపెద్ద కంపెనీల్లో ఇదొకటి. ఈ కంపెనీ ఎపిక్ గేమ్స్, వాల్వ్, రియోట్ గేమ్స్, క్రాఫ్టన్, యూబీసాఫ్ట్‌తో కలిసి పనిచేస్తోంది. ఇండియా గేమింగ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. మనదేశంలో కోట్లాది మంది గేమర్లు ఉన్నారని అంచనా.