బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బారోవర్లకు ఉపశమనం

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బారోవర్లకు ఉపశమనం

న్యూఢిల్లీ: రెపో రేటుతో లింకై ఉన్న లోన్లపై వడ్డీ రేటును  25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) ప్రకటించింది. దీంతో బ్యాంక్  రెపో -లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) 9.05 శాతం నుంచి 8.80 శాతానికి దిగొచ్చింది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) తాజా ఎంపీసీ మీటింగ్‌‌లో  రెపో రేటుకు 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టి, 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. బీఓఎం  అందించే అన్ని రిటైల్ లోన్లు ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌తో లింకై ఉన్నాయి. 

ఫలితంగా హోమ్, కార్, ఎడ్యుకేషన్, గోల్డ్, ఇతర రిటైల్ లోన్లపై వడ్డీ దిగిరానుంది. బ్యాంక్ అందించే హోమ్ లోన్లపై వడ్డీ రేటు 7.85 శాతం నుంచి, కార్ లోన్లపై వడ్డీ రేటు 8.20 శాతం నుంచి  ప్రారంభం కానున్నాయి.  ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) కూడా ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌తో లింకై ఉన్న లోన్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.