హైదరాబాద్: సినీ నటుడు రాజ్ తరుణ్ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి కేసులో హీరో రాజ్ తరుణ్ కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రాజ్ తరుణ్ తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి.. రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చారు. లావణ్యతో పెళ్లి జరిగినట్లు ఎలాంటి ఆదారాలు లేకపోవడంతో బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు తెలిపింది.
టాలీవుడ్ లో గత కొద్ది కాలంగా హీరో రాజ్ తరుణ్ , అతని మాజీ ప్రియురాలు లావణ్య ఎపిసోడ్ నడుస్తున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని.. ప్రెగ్నెంట్ చేసి ఏకంగా అబార్షన్ కూడా చేయించాడు అంటే సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. అంతేకాదు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాలో ఎఫైర్ నడుపుతున్నాడని అందువల్లే తనను విడిచి పెట్టాడంటూ తీవ్ర పోలీసులకు కంప్లైంట్ చేసింది లావణ్య.
ఈ విషయంలో మాల్వి మల్హోత్రా స్పందిస్తూ.. లావణ్య ఓ క్రిమినల్ .. ఆమెను క్రిమినల్స్ తో సంబంధాలున్నాయని కామెంట్ చేసింది. రాజ్ తరుణ్ దీనిపై స్పందిస్తూ.. లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్న విషయం వాస్తవమే.. కానీ ఆమెను పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. ఆవిడ డ్రగ్స్ తీసుకున్న కేసులో జైలుకు వెళ్లి వచ్చిందని అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ తెలిపారు.
రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్ లో పోలీసులు రంగ ప్రవేశం చేసి రాజ్ తరుణ్ అరెస్ట్ కు సిద్దమవుతుండగా.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో గురువారం రాజ్ తరుణ్ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.