చలితో వణికిపోతున్న జనానికి ఇదొక రకమైన రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మరో వారం రోజుల్లో చలి తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మరో వారం రోజుల వరకు తెలంగాణ చలి తీవ్రత ఉంటుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలు, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, ములుగు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్ ,రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలో జనవరి 22న అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు వెల్లడించింది. తెలంగాణలో చల్లటి గాలులు, వాతావరణం జనవరి 26 వరకు ఉండొచ్చని అంచనా వేసింది.
హైదరాబాద్లో లోనూ మరో వారం తర్వాత చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శ్రీ లింగంపల్లిలో చలి తీవ్రత తగ్గుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.