మా ఉద్యోగులను రిలీవ్ చేయండి : అన్ని శాఖలకు  హౌసింగ్ ఎండీ లేఖలు

మా ఉద్యోగులను రిలీవ్ చేయండి : అన్ని శాఖలకు  హౌసింగ్ ఎండీ లేఖలు

హైదరాబాద్, వెలుగు:  హౌసింగ్ కార్పొరేషన్ కు చెందిన ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని అన్ని శాఖలకు, కార్పోరేషన్లకు హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ లేఖ రాశారు. వీరు త్వరలో ఆయా శాఖలు, కార్పొరేషన్ల నుంచి రిలీవ్ అయ్యి.. హౌసింగ్ కార్పొరేషన్లలో జాయిన్ కానున్నారు. 13 డిపార్ట్ మెంట్లు,  15 కార్పొరేషన్లలో మొత్తం 242 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిని  వెంటనే రిలీవ్ చేయాలని సీఎం ఆదేశించటంతో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ  సందీప్ కుమార్ సుల్తానియా గత నెల 26న జీవో జారీ చేశారు.

దీంతో విడిగా ఆయా శాఖలు, కార్పొరేషన్లకు ఎండీ లేఖ రాశారు.  కార్పొరేషన్ కు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, బేవరేజెస్ కార్పొరేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్లల్లో డ్యూటీ చేస్తున్నారు.