టీవీల్లో మతపరమైన డిబేట్లు ఆపాలి.. నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ సంస్థ డిమాండ్

టీవీల్లో మతపరమైన డిబేట్లు ఆపాలి.. నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ సంస్థ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: బెట్టింగ్ యాప్​లను నిషే ధించినట్లుగానే టీవీల్లో మతపరమైన ఓపెన్ డిబేట్లను నిషేధించాలని  నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ సంస్థ డిమాండ్ చేసింది. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి ఆదివారం ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద గ్లోబల్ అలయన్స్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్స్ తో కలిసి నిరసన తెలిపింది. ఆయా సంస్థల అధ్యక్షులు డేవిడ్ శాంతరాజ్, సీఏ డేనియల్ ఆడమ్స్ మాట్లాడుతూ.. పాస్టర్ ప్రవీణ్   మరణానికి ఏపీ లోని కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించి, ఆయన డెడ్​బాడీకి రీ పోస్ట్​మార్టం చేయించాలని డిమాండ్ చేశారు. 

టీవీ, యూట్యూబ్ చానల్స్​లో నిర్వహించే డిబేట్లు మతాలు, మనుషుల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. మరికొంత మంది పాస్టర్లను అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని, పాస్టర్ అజయ్ బాబుకు రక్షణ కల్పించాలని కోరారు. డీడీ వెంకట్ రాజ్, మత్తయ్య, బిషప్ స్వామిదాస్, పోచన్న తదితరులు పాల్గొన్నారు.