హనుమకొండ సిటీ, వెలుగు : పిల్లలపై ఆన్లైన్లో జరుగుతున్న లైంగిక దాడులను నిర్మూలిద్దామని మత పెద్దలు పిలుపునిచ్చారు. శనివారం ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, చిల్ర్డన్స్ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా హనుమకొండ అసంత భవన్ సుబేదారిలో ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్ అధ్యక్షతన వరంగల్, హనుమకొండ, మహబూబాద్ జిల్లాలకు సంబంధించిన పూజారులు, ముస్లిం కాజీలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు
కమ్యూనిటీ నాయకులకు బాలలపై ఆన్లైన్లో జరుగుతున్న వేధింపులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పూజారుల వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సిద్ధాంతి ఆచార్యులు మాట్లాడుతూ లైంగిక వేధింపుల నిర్మూలను దేవాలయాల్లో తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కలిగిస్తామన్నారు. అనంతరం పరకాల ఇమామ్ కాజీ అజిదున్ మాట్లాడుతూ పిల్లలకు మొబైల్ వాడకంపై జాగ్రత్తలు చెప్పాలన్నారు.