డ్రగ్స్ నివారణకు మత గురువులు పోరాడాలి.. ధార్మిక జనమోర్చా సమావేశంలో వక్తలు

డ్రగ్స్ నివారణకు మత గురువులు పోరాడాలి.. ధార్మిక జనమోర్చా సమావేశంలో వక్తలు

బషీర్ బాగ్, వెలుగు: డ్రగ్స్ నివారణకు చేస్తున్న పోరాటంలో మత గురువులు ముందడుగు వేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నేటి యువత మద్యం, మాదకద్రవ్యాల మత్తులో జోగుతోందని.. మత్తు పదార్థాలను నివారించాల్సిన బాధ్యత మత గురువులపై ఉందన్నారు. 

లక్డీకాపూల్ లోని ఓ హోటల్ లో శనివారం ధార్మిక జనమోర్చా ఆధ్వర్యంలో ‘డగ్స్ తో ముప్పు.. అరికట్టడంలో మత గురువుల పాత్ర’ అనే అంశంపై ఇంజనీర్ డాక్టర్ సలీమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 

డ్రగ్స్​నిర్మూలనకు అన్ని మతాల గురువులు ఒకే వేదిక మీదకు రావాలని కోరారు. పిల్లలను ధార్మిక చింతనతో, నైతిక విలువలతో పెంచాలన్నారు. పిల్లలకు బాల్యం నుంచే భక్తిని అలవర్చాలని అప్పుడే పెద్దయ్యాక వ్యసనాలకు దూరంగా ఉంటారని చిలుకూరు బాలాజీ దేవాలయం పండితులు లక్ష్మీ నరసింహులు చెప్పారు. నార్కోటిక్ డీఎస్పీ సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.